Karthika deepam2 : మంచివాడిలా నటిస్తున్న గౌతమ్.. పెళ్ళికి ఒకే చెప్పిన జ్యోత్స్న!
on Mar 19, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -308 లో..... జ్యోత్స్నకి పెళ్లి చూపులు జరుగుతాయి. అబ్బాయి గౌతమ్.. జ్యోత్స్న ఫ్రెండ్ అందరి ముందు మంచివాడిలాగా యాక్ట్ చేస్తుంటాడు. మా ఆస్తులకి ఏకైక వారసురాలు అని శివన్నారాయణ చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న, గౌతమ్ లని పక్కకి వెళ్లి మాట్లాడుకోమని చెప్తారు. దాంతో ఇద్దరు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. మీ బావని మర్చిపోయావా అని గౌతమ్ అడుగుతాడు. గతం గురించి మర్చిపోవాలని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు ప్రాక్టికల్ గా ఉంటావని గౌతమ్ అంటాడు. జ్యోత్స్నకి రెడ్ రోజ్ ఇస్తాడు గౌతమ్. ఎందుకు నేను అంటే ఇంత ఇష్టమని జ్యోత్స్న అడుగుతుంది.
ఇందాకే చెప్పాడు కదా.. మీ తాతయ్య ఈ ఆస్తులకి ఏకైక వారసురాలు అని.. నా ఎంజాయ్ కి లిమిట్ లేదని గౌతమ్ తన మనసులో అనుకుంటాడు. అప్పుడే పారిజాతం వచ్చి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తుంది.
ఇక ముహూర్తాలు పెట్టుకుందామని గౌతమ్ పేరెంట్స్ అంటారు. దాంతో పంతులు గారు నాలుగు రోజుల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఇరు కుటుంబాలు ఆ ముహూర్తాన్ని ఖాయం చేసుకుంటారు. జ్యోత్స్న స్వీట్ బాక్స్ తో కార్తీక్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది ఏంటే పెళ్లి చూపులు ఇష్టం లేక ఇలాగే వచ్చేసావా అంటూ కాంచన పొరపాటు పడి జ్యోత్స్నని తిట్టేస్తుంది.
స్వీట్ బాక్స్ తో వచ్చినా కూడా మీకు అర్ధం కాలేదా అని జ్యోత్స్న అంటుంది. ఈ మధ్య స్వీట్ బాక్స్ తో అందరు వస్తున్నారు. అందుకే అర్ధం అవ్వలేదని కార్తీక్ అంటాడు. నాకు పెళ్లి చూపులు జరిగాయి నాలుగు రోజుల్లో నిశ్చితార్థమని జ్యోత్స్న అందరికి స్వీట్ ఇస్తుంది కార్తీక్ కి ఇచ్చేసరికి బాక్స్ కాళీ అవుతుంది. నువ్వు ఈ స్వీట్ ని మిస్ అవుతున్నావ్ బావ అని జ్యోత్స్న ఏదో తేడాగా అంటుంటే.. దీప స్వీట్ తీసుకొని అందులో సగం తీసుకుంటాడు. పంచుకునేవారు పక్కనే ఉన్నప్పుడు ఎందుకు టెన్షన్ అని కార్తీక్ అంటాడు. ఎప్పటిలాగే దీపని బాధపెట్టి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. దశరథ్, సుమిత్ర, శివన్నారాయణ ముగ్గురు నిశ్చితార్థానికి పిలవాల్సిన లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. అందులో కాంచన పేరు రాయలేదని దశరథ్ అడుగుతాడు. వద్దని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
